Tuesday, August 15, 2017

 జీవపరిణామము
సృష్టి క్రమవికాసము చెందినదని పూర్వఋషుల నుండి నేటి ఆధునికశాస్త్రవేత్తల వరకు అభిప్రాయ పరంపర కొనసాగుచున్నది. కనుక సృష్టికికారణభూతమైన బ్రహ్మపదార్థమునందలి స్థూలప్రకృతి పంచభూతములుగాపరిణామము చెందగా, సూక్ష్మప్రకృతి అనేకరకముల జీవోపాధులుగా అనేక కోట్లసంవత్సరముల కాలక్రమములో ఉద్భవించుచున్నవని తెలియబడుచున్నది. సృష్టిలో మొత్తము 84 లక్షల రకముల జీవోపాధులు ఉన్నాయని విష్ణుపురాణములోచెప్పబడినది. అందులో కొన్ని జీవోపాధులు వాటి వాటి కర్మానుసారముగాఅప్పుడప్పుడు లుప్తముకాగా, మరికొన్ని నూతన జీవోపాధులు అప్పుడప్పుడు వాటివాటి కర్మానుసారముగ ఆవిర్భవించుచున్నట్లుగా కూడ తెలియబడుచున్నది.
ఆధునిక జీవపరిణామ సిద్ధాంతమునకు ఆద్యుడుగా డార్విన్‌ను పేర్కొంటారు. “ప్రకృతిలోని మనగలిగే వాతావరణాన్ని సులభముగా అలవరచుకునే బలముగల్గినజీవులు నిరంతరాయముగా వర్ధిల్లి మరింత ఉన్నతికి పరిణామము చెందుతాయి” అని డార్విన్‌ మహాశయుడు తన సిద్ధాంతములో చెప్పినాడు. ఈ సూత్రము ప్రపంచవ్యాప్తముగా జీవశాస్త్ర అధ్యయన విధానాన్ని క్రొత్తపుంతలు త్రొక్కించినది.''ఉనికికోసం సంఘర్షణ - తట్టుకుని నిలబడగలిగిన జీవులకే ఉనికి'' అన్న అభిప్రాయాన్నిఈ ఆధునిక పరిణామ విజ్ఞానము కలుగ చేసినది.
ఐతే విశ్వవిఖ్యాత తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ డార్విన్‌ పరిణామ సిద్ధాంతంపట్ల అసంతృప్తి వ్యక్తపరిచారు. ''బతుకు లేదా ఉనికి కోసము పోరాటము - పోరాటములో తట్టుకొని నిలిచినవారికే ఉనికి'' అన్న సిద్ధాంతము వల్ల బలవంతులుమాత్రమే బ్రతుకు తారు, బలహీనులు చస్తారు అన్న భావన అంతర్లీనంగాధ్వనిస్తుంది. అందువల్ల డార్విన్‌ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతముమానవకళ్యాణమునకు దోహదపడేదిగా లేదు అన్నది రస్సెల్‌ వ్యక్తం చేసినఅభిప్రాయము.
.     స్వామి వివేకానంద డార్విన్‌ ప్రతిపాదించిన పరిణామసిద్ధాంతముపై వ్యాఖ్యానిస్తూ ''జంతు ప్రపంచంలో జీవన పోరాటము - బలవంతునదే గెలుపు'' అనే సిద్ధాంతములు బాగా వర్తిస్తాయి. అందుకని డార్విన్‌ 'జీవపరిణామ సిద్ధాంతము కొంత వరకూ నిజమేనని కొందరు నమ్ముచున్నారు. కానీమానవసామ్రాజ్యములో బుద్ధివిచక్షణవ్యక్తీకరణ ఉండడం వల్ల డార్విన్‌ సిద్ధాంతము మానవుల విషయములో చెల్లదు. మనిషి ఉన్నతస్థితి అతని త్యాగబుద్ధి ఆధారముగానే గుర్తింపు పొందుతుంది. ఇతరుల కొరకు త్యాగము చేయగలిగిన వాడు మానవులలో గొప్పవాడుగా పరిగణింపబడతాడు. అదే జంతుసామ్రాజ్యములో బలము కలిగి ఎక్కువ జీవులను చంపగల శక్తి కల జంతువే గొప్ప జంతువుగా గుర్తింపబడుతుంది. ఈ కారణముల వల్ల డార్విన్‌ ప్రవచించిన సిద్ధాంతము జంతువులకూమనుషులకూ సమానముగా వర్తించదు. మనిషి చేసే పోరాటము మానసికమైనది. ఏ మనిషి తన మనసును నియంత్రించుకొని స్థితప్రజ్ఞ లక్షణమును సాధిస్తాడో అతడు తన ఆత్మను ఆవిష్కరించుకోగలడు '' అన్నారు.         
జీవపరిణామము గురించి పతంజలి వ్యక్తము చేసిన అభిప్రాయమేమిటనగా''జాత్యంతర పరిణామ: ప్రకృత్యా పురాత్‌|| - జీవి మరోజీవిగా మారడానికి కారణము దాని అంత: ప్రకృతి. – (పతంజలి యోగా సూత్రాలుఅధ్యాయము 4 శ్లోకము 2.) ''. జీవులు ఒక ఉపాధి నుండి ఇంకొక ఉపాధికి మారటానికి కారణం వాటిలోని అంత: స్వభావం. పాపపుణ్యములు ఈ పరిణామమునకు ప్రత్యక్షకారణాలు కావు. అవి కేవలం అడ్డంకులు మాత్రమే. తన పొలములో నీటిపారుదలకు కలుగు అడ్డంకులను రైతు తొలగించుకొని ముందుకు సాగాలి'' అన్నది పతంజలి చెప్పినదాని సారాంశము ఈ సిద్ధాంతాన్నే స్వామి వివేకానంద తన రాజయోగ భాష్యంలో వివరిస్తూ 'పరిపూర్ణత మానవుని తత్త్వం'' ఈ విషయాన్ని ప్రకటించడంలోనే కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఎవరైనా ఈ ప్రవృత్తిని దాటగలిగితే తన స్వత: సిద్ధమైన శక్తిని పొందగలడు. మనిషిని పరిపూర్ణత వైపు నడిపించేది ఆ ప్రవృత్తియే. అదే అందరినీ అక్కడకు చేర్చుతుంది. పరిపూర్ణత సాధించడం మానవుల జన్మహక్కు అంటూ వివేకానందుడు ''ప్రాచీన ఋషులుచెప్పిన మానవ పరిణామ సిద్ధాంతాన్ని ఆధునిక విజ్ఞానం సహాయంతో మరింత బాగాఅర్థం చేసుకోగలుగుతున్నాం.  ఇప్పటికీ ఆ యోగి పుంగవుల వివరణలుఉన్నతమైనవి. ఆధునిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన 'లైంగిక భాగస్వామి ఎన్నిక',  'బలవంతుడే మనగలడు' అనే రెండు సిద్ధాంతాలు అసంపూర్ణమైనవి. ఒకవేళఆధునిక శాస్త్ర విజ్ఞానం పురోగతి చెంది భాగస్వామిని ఎన్నుకోవడం, భౌతిక శక్తినిపొందగలిగే సమర్థులను కనుగొంటే పోటీ లేని ఆ కాలంలో మానవ పరిణామంఆగిపోతుందా! జాతి అంతరిస్తుందా! దీనికి ఆధునిక విజ్ఞానం సమాధానం చెప్పదు.'' - అని తెలియజేశారు.
అచల సిద్ధాంతము ప్రకారముగా ఒక జీవి మరొక జీవిగా మారడాని కొన్ని కోట్ల సంవత్సరములు పట్టును. మానవుడు కూడా మొదట్లో వానరుడుగా సంచరించిన వాడే. ఒక జీవిలోని సూక్ష్మశరీరమే మరొక ఉపాధిని పొందుచున్నది. ఇది ఆయా సూక్ష్మ శరీరములందని అంతఃప్రవృత్తియగు కర్మ వల్లనే జరుగుచున్నది. కనుక కర్మకు తగిన ఉపాధి ఆయా సూక్ష్మశరీరములకు సిద్ధించుచున్నదని తెలియబడుతుంది.  కర్మవల్ల జన్మ, జన్మ వల్ల కర్మ కల్గుచున్నది. కనుక పూర్ణ విషయమును పరిపూర్ణ గురువులను జేరి తెలిసికొనగోరుచున్నాను. 

Monday, June 6, 2016

Poem

కొత్తగా ద్రవ్యాన్ని కొత్తగా శక్తిని
పుట్టించ గలవారు పుడమినెవరు?
కొత్తగా జీవుల్ని కొత్తగా భూతాల్ని
సృజియించ గలవారు సృష్టినెవరు?
కొత్తగా ఆత్మను కొత్తగా బ్రహ్మను
జనియింప గలవారు జగతినెవరు?
కొత్తగా స్వర్గాన్ని కొత్తగా నరకాన్ని
నిర్మింప గలవారు నిలను యెవరు?
వున్న వస్తువులే మార్పు తిన్నగాను
చెందుచుండగా కొత్తగా నిందులోన
తోచుచుండును కళ్ళకు త్రుళ్ళిపడక
క్రొత్తదేదియు లేదని కుదుటపడుము!
Meaning:
None can create either matter or energy.
None can create either Jivas (living beings) or bhutas (elements).
None can create either Atman (Consciousness) or Brahman (Supreme consciousness).
None can create either heaven or hell.
All these are ever changing from one form to another.
And sometimes these look afresh and new, but everything is old.
So don't be feel thrilling when something looks like new and later sad when it becomes old.
Just cool down by knowing that there are no new things here in this world!

Poem

శాశ్వతానందంబు చక్కగా కలుగని
నమ్మించు వారిని నమ్మబోకు!
శాశ్వత సుఖములు స్వర్గాన కలుగని
కాంక్షించు వారిని కలియబోకు!
తనువుతో మోక్షంబు తథ్యంగ కలుగని
ఆశించు వారిని అంటబోకు!
లోకాల భోగంబు జోకతో కలుగని
మోహించు వారిని మ్రొక్కబోకు!
శాశ్వతానందమేదని సర్వమందు
వెదకి జూచిన లేదులే విదితముగను
ఇదియు తత్త్వరహస్యంబు ఇదియు నిజము
భ్రాంతులందున పడకుమో క్రాంతిధీర!
Meaning:
There is no eternal bliss even if you go anywhere in this universe. If someone says there is eternal bliss, don't believe him.
There are no eternal enjoyments in the heaven. If someone says there are eternal enjoyments in the heaven, don't agree.
There is no liberation along with the physical body. If someone says there is liberation along with the physical body, don't compromise.
There is no eternal joy in the other worlds. If someone says there is eternal joy in the other worlds, don't follow.
There is no eternal bliss anywhere if you search throughout the universe and the Brahman. This is the secret of the philosophy and this is reality. O Conscious Brave Man! don't fall for illusions!!
ఆహారనిద్రలు ఆనందభయములు
సర్వజీవములకు సమము నిజము!
జ్ఞానమే అధికంబు మానవోపాధికి
జ్ఞానమే లేకున్న జంతు విధము!
జంతుజాలము వలె జనియించి బ్రతుకక
జ్ఞానమొంద నరుని జన్మ ఘనము!
ఘనమైన గురుదేవు కరుణతో బోధించ
జ్ఞానంబు కలుగుగ జనులు నయము!
పశువు పద్ధతివీడియు పరమగురుని
నాశ్రయించియు తత్త్వంబునంత దెలిసి
జ్ఞానకర్మలనొక్కటిగాను జేసి
భక్తి తోడుత నడచిన భవముబాయు!
Meaning:
For all living beings - food, sleep, copulation, and fear are equal.
But the spiritual knowledge of human beings is superior to the other living beings' general knowledge.
If one has no spiritual knowledge, he is equal to an animal only.
Instead of living like an animal, if one uncovers the spiritual knowledge in his heart, his life will be so great.
If a holy guru preaches kindly, the spiritual knowledge shines in the hearts of the people definitely.
By renouncing the animal instincts, one has to take refuge at the feet of a realized guru and has to know the complete philosophy.
And by unifying the jnana and the karma, one has to live the life with a devotion. Then he will not be getting a birth again.

Poem

జన్మకలిగినచో కర్మతా కలుగును
కర్మవల్ల సుఖదుఃఖములు కల్గు!
దుఃఖము వద్దన్న సుఖముతా కలుగదు
సుఖదుఃఖములు రెండు జూడనొకటె!
పగలురాత్రి వలెను పాటించి జూడగా
సుఖదుఃఖముల మర్మసూచి తెలియు!
దుఃఖము వద్దన్న సుఖము తా గోరక
జన్మరహితమొంద కర్మబాయు!
కర్మ గుహ్యమెరింగియు కర్మరహిత
మైన మార్గమునందున మహిమతోడ
నడచినన్ జన్మబాధలు నణిగిపోయి
సర్వసుఖదుఃఖముల గుర్తు సమసిపోవు!
Meaning:
If a birth takes place, a karma (action) will take place. By that karma, pains and pleasures will occur. If there is no pain, there will be no gain. Pains and pleasures are two sides of the same coin and those are one with two dimensions. By observing the day and the night, we can understand the secret index of the pains and pleasures. If one doesn't want pains, he shouldn't desire to get pleasures. If one doesn't have desires, he will not take birth again and the karma will vanish.
By knowing the secret of karma, one has to live a life in a
miraculous living style. Then all his pains caused because of the previous lives and the present life will disappear. And the signs/memories of all the pains and the pleasures will vanish too.
బ్రహ్మవివర్తంబు బాగుగా జగముగా
మాయ పరిణమించ నాయటండ్రు!
త్రాడుయే పాముగా రాత్రిలో కన్పించు
చందాన బ్రహ్మందు జగతియండ్రు!
నిర్గుణ బమ్మము నికరంగ నుండనీ
జగము మాయయని యసత్యమండ్రు!
ఆత్మనుండి జగము అవతరించదనియు
ద్వైతరహితులుయద్వైతులండ్రు!

లేని మాయయందు జగము లేకపోక
నేల పరిణమించు జగము లీలగాను?
ఆత్మపరిణామమే జగంబనుచు దెలిసి
యేక పద్ధతిన్ చూడుమో లోకమాన్య!

Meaning:
The Advaitins say that manifestation of the Brahman as the world is because of the transformation of the Maya.
They say that the world appears in the Brahman like a snake appears in a thread in the night.
They say that the Brahman is without any qualities and it is the permanent and it is truth whereas the world is maya, impermanent and untruth.
The Advaitins say that the world is not transformed from the Atman.
How does the world exist in the non-existing maya?
How does that world transform in nothingness? It can't.
So one has to know that the Brahman(Atman) has transformed as the world itself and one has to see the oneness in the Brahman and the world. O Honorable Man! Realize this secret!
ఎంత విచారించి ఎంత నేర్చిన తాను
ఉన్నచోట నరుడు నుండు నటులె!
గతులెన్ని నేర్చిన గగనాన్ని దాటడు
జీవించు మునుపటి జీవితమునె!
ఎంత తత్త్వంబును ముంతలో జూచినా
వింతలే జరుగక చింతలిడవు!
ఎన్నిమర్మములను యెంతగా శోధించ
తనయొక్క విధికర్మ తప్పబోదు!
కాని పరిపూర్ణబోధను తాను గోరి
పరమ గురుదేవు కరుణచే బాగుగాను
వినియు కనినను భ్రాంతులు వీడిపోయి
జన్మరహితమై చరితార్థ జన్మమౌను!

Meaning:
Even if one analyzes all the sciences and learns lot of things, he will still be living the same life.
Even if one learns about all kinds of journeys, he will not go outside of the sky. And he lives the same life!
Even if one realizes the essence of the philosophy in his physical body, he will not see any kinds of wonders/miracles and his sorrows will not end.
Even if one researches all the secrets of the life, he can't escape from the destiny of his actions.
But one thing he can achieve; by the grace of a guru, he can realize the essence of all the scriptures and he can annihilate all his illusions. And his cycle of births and deaths will be ended and thereby his life will be purposefully utilized.